21న జాతీయ లోక్ అదాలత్..

3చూసినవారు
21న జాతీయ లోక్ అదాలత్..
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. పంచాయతీ ఎన్నికల కారణంగా ముందుగా ఈనెల 13న జరగాల్సిన లోక్ అదాలత్‌ను 21కి వాయిదా వేశారు. గురువారం పెద్దపల్లిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ భవాని, జిల్లా అదనపు పోక్సో న్యాయమూర్తి కుంచం స్వప్నరాణి, జూనియర్ సివిల్ జడ్జి మంజులతో కలిసి లోక్ అదాలత్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :