వచ్చే ఖరీఫ్‌లో 150 ఎకరాల్లో ఆయిల్ పామ్ లక్ష్యం: కలెక్టర్

1చూసినవారు
వచ్చే ఖరీఫ్‌లో 150 ఎకరాల్లో ఆయిల్ పామ్ లక్ష్యం: కలెక్టర్
వచ్చే ఖరీఫ్ నాటికి గ్రామంలో అదనంగా 150 ఎకరాల్లో ఆయిల్ పామ్ నాటాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంట సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆయిల్ పామ్ పంట రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే లాభదాయక పంట అని, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకొని రైతులు దీని సాగును విస్తరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్