పెద్దపల్లి జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నాలుగు మండలాల్లో మొత్తం 684 వార్డులకు నోటిఫికేషన్ జారీ కాగా, అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 1641 చెల్లుబాటైన నామినేషన్లు నమోదయ్యాయి. అంతర్గాం మండలంలో 305, ధర్మారం మండలంలో 609, జూలపల్లి మండలంలో 313, పాలకుర్తి మండలంలో 414 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. అన్ని వార్డుల్లోనూ పోటీ నెలకొంది.