పెద్దపల్లి: సర్పంచ్ ఎన్నికల బరిలో సొంత అత్తా కోడళ్లు (వీడియో)

967చూసినవారు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో వినూత్న పరిస్థితి నెలకొంది. పాలకుర్తి మండలం శ్యాందాస్ నగర్ పంచాయతీలో అత్త–కోడళ్లు సర్పంచ్ పదవికి బరిలో దిగడంతో ఎన్నికలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సభ్యులే పరస్పరం పోటీ పడటం స్థానిక రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.