వీ- హబ్ భవన పెండింగ్ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

3చూసినవారు
వీ- హబ్ భవన పెండింగ్ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
పెద్దపల్లి మండలం రంగంపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వీ-హబ్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఏసీలను త్వరగా అమర్చి, మూడు రోజుల్లో పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన సూచించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని, దీని ద్వారా జిల్లా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్