హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నందను కలిసిన పెండ్యాల మహేష్

0చూసినవారు
హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నందను కలిసిన పెండ్యాల మహేష్
హైదరాబాద్‌లో  న్యాయవాది, డీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నందను మర్యాదపూర్వకంగా ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా విద్య, సమానత్వం, బహుజనులు, మహిళల అభ్యున్నతిపై చర్చించారు. అణగారిన వర్గాల అభివృద్ధికి విద్య కీలకమని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని సూచించినట్లు మహేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బర్లపాటి జయరాం, గుంజపడుగు మనోహర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్