రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, తమ కుటుంబ క్షేమం కంటే సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తారని అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన అధికారులు ఇకపై తమ కుటుంబాలకు ఎక్కువ సమయం కేటాయించాలని సూచించారు. శనివారం రామగుండం పోలీస్ కమిషరేట్ లో సుదీర్ఘకాలం సేవలందించిన పోలీస్ అధికారులను ఆయన ఘనంగా సత్కరించి, వారి సేవలను కొనియాడారు.