బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు: సీపీ

1చూసినవారు
బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు: సీపీ
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, రామగుండం కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై విధించిన నిషేధాజ్ఞలను డిసెంబర్ 1 నుండి జనవరి 1 వరకు పొడిగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం తెలిపారు. మద్యం ప్రియుల ఆగడాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిస్థితులను బట్టి ఈ నిషేధాన్ని మరింత పొడిగించే అవకాశం ఉందని, అలాగే డీజే సౌండ్ల వినియోగంపై కూడా నిషేధాజ్ఞలు పొడిగించినట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉంటుందని ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్