బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు: సీపీ

5చూసినవారు
బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు: సీపీ
రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలను నవంబర్ 1 నుండి డిసెంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదివారం తెలిపారు. మద్యం ప్రియుల ఆగడాలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రజల భద్రత, రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.

ట్యాగ్స్ :