రామగుండం టీజీ మోడల్ స్కూల్: ఎస్ఎస్సి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత

638చూసినవారు
రామగుండం టీజీ మోడల్ స్కూల్: ఎస్ఎస్సి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత
రామగుండం టీజీ మోడల్ స్కూల్ ఎస్ఎస్సి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి అద్భుత విజయాన్ని అందుకుంది. మొత్తం 100 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 45 మంది 500కు పైగా మార్కులు, 12 మంది 550కు పైగా మార్కులు సాధించారు. జస్వంత్ (577), మనో రశ్మిత (576), వైష్ణవి (573), అఖిల్ (570) అత్యధిక మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పి.సదానందం విద్యార్థులను, తల్లిదండ్రులను సన్మానించారు.
Job Suitcase

Jobs near you