9వ రోజుకు చేరుకున్న రిలే నిరహార దీక్షలు

3089చూసినవారు
9వ రోజుకు చేరుకున్న రిలే నిరహార దీక్షలు
పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి అధికారుల హక్కుల సాధన కోసం చేపట్టిన పోరాటం ఉదృతం అవుతోంది. కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్జీ వన్ జిఎం కార్యాలయం ముందు జరుగుతున్న రిలే నిరహార దీక్షలు మంగళవారం 9వ రోజుకు చేరుకున్నాయి. పలువురు అధికారులు, వివిధ పక్షాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ దీక్షలో అనిల్ గబాలే, బి. బ్రహ్మాజీ రావు, ఎం. రవీందర్ రెడ్డి, కె. రాజేష్ బాబు, డాక్టర్ జె. మద్దిలేటి, జి. హనుమంత్ రావు, ఎండీ. అక్రమ్ ఆలీఖాన్, ఎం. రాజు, ఎండీ. ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్