పెద్దపల్లి జిల్లాలో రోడ్డు భద్రత చర్యలను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దపల్లి ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై సమీక్షించారు. కొత్త డిపో సమీపంలో బస్ స్టాండ్ రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.