
ఎన్ని జన్మలెత్తినా తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాదు: సీఎం స్టాలిన్
బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా తమిళనాడులో అధికారంలోకి రాదని భారతీయ జనతా పార్టీ, కేంద్ర మంత్రి అమిత్ షాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది బీహార్ కాదు తమిళనాడు.. ఇక్కడ బీజేపీ నాయకుల ఆటలు సాగవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రేమతో వస్తే స్వాగతిస్తారని, అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారని స్టాలిన్ హెచ్చరించారు. అమిత్ షా కాదు మొత్తం బీజేపీ నాయకులు వచ్చినా ఇక్కడ గెలవలేరని అన్నారు.




