రెండో విడత 84. 15 శాతం పోలింగ్ నమోదు: కలెక్టర్

8చూసినవారు
రెండో విడత 84. 15 శాతం పోలింగ్ నమోదు: కలెక్టర్
జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో 84.15 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. ఆదివారం ధర్మారం, దొంగతుర్తి, మేడారం, పాలకుర్తి, కుక్కల గూడూరు, ఈసాల తక్కలపల్లి, బసంత్ నగర్ పోలింగ్ కేంద్రాలు, అంతర్గాం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ఆన్లైన్ ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు. జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరుగుతున్న 4 మండలాల పరిధిలో 84.15శాతం వరకు పోలింగ్ నమోదైందని, 94 వేల 807 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్