జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

0చూసినవారు
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల 7వ తరగతి విద్యార్థి యశ్వంత్ తేజ, అండర్-14 69వ ఎస్ జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. నవంబర్ 26 నుండి 28 వరకు నంది మేడారంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ విజయం సాధించాడు. జనవరి 5 నుండి 9 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలలో తెలంగాణ జట్టు తరఫున యశ్వంత్ పాల్గొంటాడు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్