పెద్దపల్లి జిల్లా నోడల్ ఆఫీసర్ గా శోభారాణి

1చూసినవారు
పెద్దపల్లి జిల్లా నోడల్ ఆఫీసర్ గా శోభారాణి
తెలంగాణ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీతో సమన్వయం కోసం పెద్దపల్లి జిల్లా నోడల్ ఆఫీసర్‌గా అంతర్గాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ తులా శోభారాణిని జిల్లా కలెక్టర్ ఆమోదంతో నియమిస్తూ జిల్లా విద్యాధికారి శారద మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం ద్వారా జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని శోభారాణి తెలిపారు. తన నియామకానికి సహకరించిన జిల్లా కలెక్టర్, విద్యాధికారికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.