న్యూ ఇండియా పార్టీకి షోకాజ్ నోటీస్ జారీ: జిల్లా కలెక్టర్

1409చూసినవారు
న్యూ ఇండియా పార్టీకి షోకాజ్ నోటీస్ జారీ: జిల్లా కలెక్టర్
న్యూ ఇండియా పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్డ్ పార్టీలు తప్పనిసరిగా నియామక ఆడిట్ అకౌంట్స్ సమర్పించాలి. అయితే, న్యూఇండియా పార్టీ 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన ఆడిట్ అకౌంట్స్ వివరాలను సమర్పించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో ఈ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధి చట్టం 1951, సెక్షన్ 29-ఎ ప్రకారం ఈ చర్య తీసుకోబడింది.