నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. దర్యాప్తులో జాప్యంపై అధికారులను ప్రశ్నించి, తక్షణ చర్యలకు ఆదేశించారు.