పెద్దపల్లి జిల్లా కోర్టు భవనాన్ని అక్కడే నిర్మించాలని న్యాయవాదులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కోరారు. సోమవారం పెద్దపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇటీవల ఎమ్మెల్యేను ఇదే విషయంపై కోరగా, ఆయన దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ న్యాయవాదులు కోర్టు ఎదుట విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాస్, సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.