ఉద్యోగాలకు 14 మంది ఎంపిక

2884చూసినవారు
ఉద్యోగాలకు 14 మంది ఎంపిక
పెద్దపల్లి జిల్లా, రామగుండంలో సింగరేణి ఏరియా-1 జనరల్ మేనేజర్ శ్రీ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉద్యోగ ఇంటర్వ్యూలు జరిగాయి. ఈ ఇంటర్వ్యూలలో మొత్తం 14 మంది అభ్యర్థులు ఉద్యోగాలు, శిక్షణా అవకాశాలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ట్రాన్స్‌పరెంట్ కార్పొరేట్ సర్వీసెస్ సంస్థ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేసింది. మహిళా అభ్యర్థుల కోసం కిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాన్-టెక్నికల్ విభాగంలోనూ అవకాశాలు కల్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్