గోదావరి ఖని గౌతమ్ నగర్ సమీపంలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో, వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో బతకమ్మ, దసరా పండుగ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు శనివారం పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది.