పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వుల మేరకు, కనగర్తి గ్రామానికి చెందిన పర్స విజయ్ కుమార్ ను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడిగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. తన నియామకానికి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యే విజయరమణారావులకు, నాయకులకు విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.