యుద్ధాలు సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే..

5చూసినవారు
యుద్ధాలు సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే..
పెద్దపల్లిలో మంగళవారం ప్రజా సంఘాల నాయకులు ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. యుద్ధాలు సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమేనని, ఈ చర్యలు మానవత్వానికి విఘాతమని వారు అన్నారు. విరసం జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసనలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం, ఏఐఎఫ్టియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్