
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రజా సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులను ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. మంగళవారం ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 8వ కాలనీ, 15, 19 డివిజన్లలో ఆయన ప్రజలతో నేరుగా మాట్లాడి తాగునీరు, మౌలిక వసతులు, డ్రైనేజీ, రహదారుల వంటి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో చర్చించారు.





























