రామగుండం - Ramagundem

మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి

మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి

తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే విజయ రమణారావుకు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రవీందర్, ఖాజాలు మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను పంచాయతీల నిధుల ద్వారా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2న ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, సిబ్బంది అందరినీ 2వ పిఆర్సీ పరిధిలోకి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా
Mar 14, 2026, 13:03 IST/

రాష్ట్రంలో గ్యాస్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Mar 14, 2026, 13:03 IST
TG: రాష్ట్రంలో ప్రజలు భయంతో గ్యాస్ సిలిండర్లను రెట్టింపు బుకింగ్ చేస్తున్నారని, గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదని, వాణిజ్య సిలిండర్ల కొరత ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమైన ఆయన, 810 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 1.3 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులు, దీపం పథకం కింద 28 లక్షల మంది వినియోగిస్తున్నారని, ప్రతి నెలా 60 లక్షల సిలిండర్లు వాడుతున్నారని పేర్కొన్నారు.