పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరిలో కొట్టుకుపోయిన సాయి అనే వ్యక్తి ఆచూకీ 24 గంటలు గడిచినా లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం 11:30 గంటల వరకు కూడా అతని ఆచూకీ దొరకలేదు. ఈరోజు ఉదయం ఫైర్ సిబ్బంది తమ పడవ సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సమీప విలోచవరం గజ ఈతగాల బృందం ఎలిమడుగు చివరిగా ఒడ్డు సోనా పెళ్లి వరకు గాలింపు చేపట్టాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు వారు గోదావరిలో పడవల సాయంతో గాలింపు కోసం బయలుదేరారు.