మానేరులో దూకి ఆత్మహత్యాయత్నం కాపాడిన డిస్ట్రిక్ట్ గార్డ్

1994చూసినవారు
తంగలపల్లి గ్రామానికి చెందిన సుర నవీన్ (27) అనే వ్యక్తి ఈరోజు సాయంత్రం తంగలపల్లి బ్రిడ్జి వద్ద మానేరు వాగులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విధి నిర్వహణలో ఉన్న డిస్ట్రిక్ట్ గార్డ్ కానిస్టేబుల్స్ గంగరాజు, అనిల్ వెంటనే స్పందించి వాగులోకి దూకి ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి ఆ వ్యక్తితో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాపాయం లెక్కచేయకుండా రక్షించిన కానిస్టేబుల్స్ గంగరాజు, అనిల్‌లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.

సంబంధిత పోస్ట్