ఐదు రోజుల పసికందు మృతి

754చూసినవారు
ఐదు రోజుల పసికందు మృతి
వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐదు రోజుల పసికందు మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన అనూష అనే గర్భిణీకి ఐదు రోజుల క్రితం డెలివరీ జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతి చెందాడని అనూష కుటుంబీకులు ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ప్రసవం తర్వాత సరైన వైద్య సేవలు అందించలేదని ఆరోపించారు. అయితే, బాబు పుట్టినప్పటి నుంచి బాగానే ఉన్నాడని, మెరుగైన వైద్యం అందించామని, ఇన్ఫాంట్ సిండ్రోమ్ వల్ల మృతి చెంది ఉండవచ్చని, దీనిపై విచారణ చేస్తామని, పోస్ట్ మార్టంకు సిద్ధంగా ఉన్నామని పిడియాట్రిక్ ఇంచార్జ్ డాక్టర్ సుహాసిని స్పష్టం చేశారు. తమ నిర్లక్ష్యం ఏమీ లేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్