అసెంబ్లీలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంపై BRS ఆందోళనకు దిగింది. హౌస్ కమిటీ వేయాలని, పొంగులేటిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని BRS ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే గవర్నర్‌ను కలుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పోడియం వైపు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.