మున్సిపల్ ఎన్నికల వేళ రూ.20 లక్షల నగదు పట్టుబడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చెక్‌పోస్ట్ వద్ద ఎస్‌ఎస్‌టీ బృందం వాహనాల తనిఖీలు చేసింది. ఈ తనిఖీల్లో ఓ కారులో రూ. 20 లక్షల నగదు పట్టుబడింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనేది తెలియాల్సి ఉంది.