మానాల గ్రామంలో వర్షంతో రైతుల ఆనందం

3700చూసినవారు
మానాల గ్రామంలో వర్షంతో రైతుల ఆనందం
రుద్రంగి మండలం మానాల గ్రామంలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం రైతుల్లో ఆశలు నింపింది. కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు వరుణుడు కరుణించడంతో గ్రామంలో ఆనందకర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సాగులో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలకు ఈ వర్షం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ వర్షంతో సాగు పనులు మరింత ఊపందుకోనున్నాయని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్