మూడపల్లిలో యంగ్ ఇండియా స్కూల్‌కు శంకుస్థాపన

3191చూసినవారు
మూడపల్లిలో యంగ్ ఇండియా స్కూల్‌కు శంకుస్థాపన
చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శంకుస్థాపన చేశారు. 2,600 మంది విద్యార్థులకు వసతితో పాటు నాణ్యమైన విద్య అందించేలా ఈ విద్యాసంస్థను 16-18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆది శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్