రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ ఆదర్శ యువజన సంఘ మహిళలు ఆదివారం గ్రామ దేవత పోచమ్మతల్లికి చలి బోనాలు సమర్పించారు. పెద్ద ఎత్తున మహిళలు పిల్లా పాపలతో కలిసి చలి బోనాలు నెత్తినెట్టుకొని ఆలయానికి వెళ్లి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మాఘమాసం నేపథ్యంలో బోనాలు సమర్పిస్తున్నట్టు భక్తులు తెలిపారు.