
గల్ఫ్‌లో బిక్కుబిక్కుమంటున్న ప్రవాసాంధ్రులు
AP: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. క్షిపణులు, బాంబుల వర్షంతో భయానక వాతావరణం నెలకొంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, అబుదాబి, కువైట్ తదితర దేశాల్లో ఏ వైపు నుంచి బాంబుల వర్షం కురుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఆయా దేశాల్లో అమెరికన్ స్థావరాలే కాకుండా నివాస సముదాయాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.




