
ఉధృతంగా వంతెన పైనుంచి గోదావరి ప్రవాహం.. వీడియో
TG: ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి, మంజీర నదులకు వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మంజీర, గోదావరి నదులకు వరద ప్రవాహం పెరగడంతో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద ప్రవాహం పెరిగింది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ - మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వంతెన వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.




