కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో జరిగిన
కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ పనులు, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు కమిటీ ఏర్పాటు, ధాన్యం కొనుగోలు సమస్యల నివారణకు రైతు కమిటీ, ఓట్ల తొలగింపుపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. వర్షాకాలంలో ప్లాంటేషన్, ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, మండలంలో రోడ్లు, బ్రిడ్జి పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.