కార్మికులను వృద్ధాప్యంలో ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన (PM-SYM)' స్కీమ్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 60 ఏళ్లు దాటాక నెలకు రూ.3000 పెన్షన్ అందుతుంది. డ్రైవర్లు, వీధి వ్యాపారులు, నిర్మాణ కార్మికులు, రిక్షా లాగేవారు, వ్యవసాయ కూలీలు వంటి అసంఘటిత రంగ కార్మికులు దీనికి అర్హులు. అయితే వయసు ప్రకారం నెలకు తక్కువ మొత్తంలో దీనికి చెల్లిస్తే సరిపోతుంది. ఈ స్కీమ్ పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.