హైదరాబాద్‌లో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు ఇప్పటికే పోలీసులు సమాచారమిచ్చారు. కొన్ని రోజులుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండగా.. గ్రేహౌండ్స్ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.