కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారు: సీఎం రేవంత్

3942చూసినవారు
కేసీఆర్‌ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారు: సీఎం రేవంత్
TG: కేసీఆర్‌ కుటుంబాన్ని రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. ఆదివారం నల్గొండ సభలో మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే పదవులు మాత్రం కేసీఆర్‌ కుటుంబం అనుభవించిందని విమర్శించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నందుకు ప్రజలు బహిష్కరించారని, కేసీఆర్‌ కుటుంబానికి మళ్లీ పదవులు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్