TG: సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాకపోవడంతోనే రైతులు స్వయంగా వెళ్లి జూరాల ప్రాజెక్టు తాళాలు పగలగొట్టి నీళ్లు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని
బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఇతర నేతలు మాజీ మంత్రి హరీశ్‌రావు ఇంటి వద్దకు వెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ ప్రజల ఆస్తులపై దాడికి యత్నిస్తున్న
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పోలీసులు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదో స్పష్టం చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు.