
ఆర్థిక వివాదం.. 20 గంటలు తర్వాత వృద్ధురాలి అంత్యక్రియలు
ఒడిశాలోని గంజాం జిల్లా కొమాశాసన గ్రామంలో రత్నాలు రెడ్డి (65) అనే వృద్ధురాలి మృతదేహం ఇంట్లోనే 20 గంటలకుపైగా ఉండిపోయింది. కోడలు, కూతుళ్ల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన వివాదమే దీనికి కారణం. రత్నాలు రెడ్డి భర్త, ఇద్దరు కుమారులు గతంలోనే మృతిచెందారు. శనివారం రాత్రి వృద్ధురాలు మరణించగా.. కోడలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా, కూతుళ్లు ఆర్థిక వివాదం తేల్చాలని పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకుని, అందరికీ నచ్చజెప్పిన తర్వాత అంత్యక్రియలు జరిగాయి.




