TG: పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. నటుడిగా పవన్ కళ్యాణ్‌ను తెలంగాణ ప్రజలు అభిమానిస్తారని, పవన్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం ప్రభుత్వపరమైన అంశమన్నారు. సభకు అనుమతి రాకుంటే మరోసారి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలను అన్నదమ్ముల గౌరవిస్తారని అన్నారు. ఇక 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది
కాంగ్రెస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు.