ఆధ్యాత్మికత ముసుగులో వంద మందికిపైగా మహిళలను లైంగికంగా వేధించిన ఒక దొంగ బాబా గుట్టు రట్టయింది. హోటల్ గదిలో ఒక మహిళతో ఉండగా గమనించిన స్థానికులు దాడులు చేసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆగ్రహానికి గురైన ప్రజలు ఆ దొంగ స్వామీజీకి అక్కడికక్కడే దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పూజలు, దోష నివారణ పేరిట అమాయక మహిళలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.