
స్మాల్ సేవింగ్స్ వడ్డీ రేట్లపై రేపే కేంద్రం సమీక్ష!
కేంద్ర ప్రభుత్వం బుధవారం (సెప్టెంబర్ 30) స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేట్లపై సమీక్షించి, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రేట్లను ఖరారు చేయనుంది. ద్రవ్యోల్బణం పెరిగినా, రికార్డు స్థాయి కలెక్షన్ల నేపథ్యంలో వడ్డీ రేట్లలో మార్పు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టులో ద్రవ్యోల్బణం 4.82%గా ఉండగా, ఏప్రిల్-జూలై మధ్య కలెక్షన్లు రూ.1.54 లక్షల కోట్లకు (56% వృద్ధి) చేరుకున్నాయి.




