ఈ సమస్యలు ఉన్నవారు రొయ్యలు తింటే ప్రమాదం!

28చూసినవారు
ఈ సమస్యలు ఉన్నవారు రొయ్యలు తింటే ప్రమాదం!
మాంసాహార ప్రియులు రొయ్యలను అమితంగా ఇష్టపడి తింటారు. అయితే కీళ్ల నొప్పులు, కిడ్నీ, థైరాయిడ్, గుండె జబ్బులు అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారు వాటిని తీసుకోవద్దని వైద్యనిపుణులు చెబుతున్నారు. వీటిలోని ప్యూరిన్లు శరీరంలో యూరిక్ యాసిడ్ను పెంచి కీళ్లనొప్పులకు కారణమవుతాయి. అలాగే, రొయ్యలలో ఉండే అధిక కొలెస్ట్రాల్ గుండెకు, అధిక అయోడిన్ సోడియం థైరాయిడ్, కిడ్నీరోగుల ఆరోగ్యానికి ప్రమాదకరం. అలర్జీ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్