బ్రెజిల్‌లో విదేశీయులకు శాశ్వత నివాసం సులభమైంది. రూ.27 వేలకే పర్మినెంట్ రెసిడెన్సీ పొందే అవకాశం కల్పిస్తోంది. నెలకు 2 వేల డాలర్ల ఆదాయం ఉన్నవారు ముందుగా తాత్కాలిక నివాసానికి దరఖాస్తు చేసుకుని, తర్వాత శాశ్వత నివాస హక్కు పొందవచ్చు. దీనికి పాస్‌పోర్టు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్, లీగల్ ఎంట్రీ పత్రాలు, జాబ్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ ఆధారాలు అవసరం. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు 4–6 నెలలు పట్టనుంది.