భారత ధనవంతుల లిస్ట్‌లోకి పర్‌ప్లెక్సిటీ సీఈవో

18479చూసినవారు
భారత ధనవంతుల లిస్ట్‌లోకి పర్‌ప్లెక్సిటీ సీఈవో
AI ఆధారిత సెర్చ్‌ ఇంజిన్ ‘పర్‌ప్లెక్సిటీ’ CEO అరవింద్ శ్రీనివాస్ భారత సంపన్న జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద విలువ రూ.21,190 కోట్లు అని హురూన్‌ భారత కుబేరుల జాబితా వెల్లడించింది. 1994 జూన్ 7న చెన్నైలో జన్మించిన శ్రీనివాస్ IIT మద్రాస్‌లో చదువుతూ రీఫోర్స్‌మెంట్ లెర్నింగ్ కోర్సులు బోధించారు. తర్వాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్కెలీలో కంప్యూటర్ సైన్స్‌లో PHD పూర్తి చేసి, ఓపెన్‌ ఏఐ, డీప్‌మైండ్, గూగుల్‌లో కీలక ప్రాజెక్టుల్లో పని చేశారు.

సంబంధిత పోస్ట్