పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న తొలి వన్డేకు వర్షం ఆటంకం కలిగించింది. ఊహించిన విధంగానే మ్యాచ్ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌ను రెండు సార్లు నిలిపివేశారు. ఆతర్వాత 35 ఓవర్లకు కుదించారు. అట ప్రారంభమైన కాసేపటికే శ్రేయాస్ అయ్యర్ 11 పరుగులకు ఔటయ్యాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, అక్సర్ పటేల్ క్రీజులో ఉన్నారు. 14.2 ఓవర్ల సమయంలో మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం 46 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.