స్కూల్‌కు బూట్లు వేసుకోరాలేదని విద్యార్థినిని కొట్టిన పీఈటీ

22చూసినవారు
స్కూల్‌కు బూట్లు వేసుకోరాలేదని విద్యార్థినిని కొట్టిన పీఈటీ
AP: ఏలూరు జిల్లా వేల్పుచర్ల జెడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి విద్యార్థిని హెప్సిబాను, బూట్లు వేసుకోలేదన్న కారణంతో పీఈటీ వెంకటేశ్వరరావు 25 గుంజీలు తీయించి, కర్రతో కొట్టాడు. దీంతో బాలిక పాఠశాలలోనే స్పృహ కోల్పోయింది. ఉపాధ్యాయులు ఆమెను ఆసుపత్రికి తరలించకుండా ఇంటికి పంపించేశారు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి బాలిక స్పృహలో లేకపోవడంతో ఏలూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడికి, దాడికి పాల్పడిన పీఈటీకి మెమోలు జారీ చేసినట్లు నూజివీడు డీవైఈవో సుధాకర్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్