హైదరాబాద్ నగరంలో వరుసగా మూడో రోజు ఇంధన కొరత కొనసాగుతోంది. అనేక పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చంపాపేట్, ఐఎస్ సదన్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. గంటల తరబడి క్యూలో నిల్చున్నా పెట్రోల్, డీజిల్ దొరకకపోవడంతో వాహనదారులు బంకుల వద్ద ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.